నటి జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష


సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై కోర్టు షాకిచ్చింది. తమిళనాడులోని ఎగ్మోర్‌ కోర్టు జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. చెన్నైకి చెందిన రామ్‌ కుమార్‌, రాజబాబుతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్‌ను నడిపించింది.

కాగా ఈ సినిమా థియేటర్‌లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ESI మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక భీమా కార్పోరేషన్‌ కోర్టులో పిటీషన్‌ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఎగ్మోర్ కోర్టు ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ.. ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా వేసింది.

ఎనభై, తొంభై ల్లో జయప్రద స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు, హిందీ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత రాజకీయల్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu