HomeTelugu Big Storiesఎలిమినేట్ అయిన తరువాత వాళ్లు నన్ను కిడ్నాప్ చేశారు.. ప్రెస్‌ మీట్‌ పెట్టిన హేమ

ఎలిమినేట్ అయిన తరువాత వాళ్లు నన్ను కిడ్నాప్ చేశారు.. ప్రెస్‌ మీట్‌ పెట్టిన హేమ

7 28

తెలుగు ‘బిగ్‌బాస్ సీజన్ 3′ లో తొలివారమే ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చేసిన నటి హేమ.. మంగళవారం నాడు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఎలిమినేషన్పై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

నాకు ఇప్పటి వరకూ ఇండస్ట్రీలో రెబల్, నవ్వుల హేమ అనే టైటిల్స్ ఉన్నాయి. నాకు ఆ రెండూ చాలు. కాంట్రవర్శీ అనే టైటిల్ నాకు వద్దు. బిగ్ బాస్‌లో నేను ఎలాంటి తప్పులు చేయకపోయినా ఎలిమినేట్ చేశారు. గూగుల్‌లో ఓట్ల శాతంలో నేనే తొలిస్థానంలో ఉన్నాను. కొన్ని కోట్ల ఓట్లు నాకు పడ్డాయి. అయితే గూగుల్ ఓట్లు తీసేశారు. గత సీజన్‌లో పొరపాట్లు దొర్లడం వల్ల.. హాట్ స్టార్ అనే యాప్ ద్వారా ఓట్లు వేసే అవకాశం ఇచ్చారు.

ఎవరైతే నన్ను బయటకు పంపాలని చూశారో.. ఇప్పుడు వాళ్లు ఎలిమినేషన్‌లో ఉన్నారు. నేను హౌస్‌లో ఉండగా.. చెబితే నేను వాళ్లపై ఆధిపత్యం చేస్తున్నా అన్నారు. ఇప్పుడు వాటర్‌తో పాటు గ్యాస్ కూడా ఆపేస్తున్నారు.

గ్యాస్‌పై వాటర్ పెట్టుకుంటా అన్నది హిమజ. నేను వద్దని చెప్పా. శ్రీముఖి గ్యాస్ అన్ లిమిటెడ్ అని చెప్పింది. ఇప్పుడు సైకిల్ తొక్కితేనే కాని గ్యాస్ రావడం లేదు. నేను పది మందికి పెట్టి వంట చేసే అనుభవం ఉంది కనుక ఎలా ఉండాలో.. ఎలా వండాలో వాళ్లకు చెప్పా. అదే తప్పై పోయింది.

ముందు నుండి నేను డ్యామినేట్ చేస్తారని వాళ్లు మనసులో పెట్టుకుని ఉన్నారు. అందుకే నేను ఏం చెప్పినా డ్యామినేట్ చేస్తున్నా అనుకునేవారు. నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి హాల్ అడిగినా.. కాంట్రవర్శి అంట కదా.. ఇవ్వము అంటున్నారు. ఏంటి కాంట్రివర్శి? నేను మంచిదాన్నే.. బాబా భాస్కర్.. నేను మంచోడుని అని చెప్పుకోవడానికి నటిస్తున్నారు. జాఫర్ నేను జర్నలిస్ట్‌లను అనే భావనలోనే ఉన్నారు. శ్రీముఖి లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడి మ్యానుఫ్యులేట్ చేస్తుంది. హిమజ.. టోటల్ మానుప్యులేట్. అలీ ప్లేయర్… రాహుల్ కప్పులు కడగడు. నేనైతే అషూ రెడ్డి హౌస్‌లో కొన్నాళ్లు ఉండాలని అనుకుంటున్నా. బిగ్‌బాస్ ద్వారా నేను ఏం నేర్చుకున్నానంటే.. ఏం మొదలుపెట్టకుండానే బయటకు వచ్చేశా. మళ్లీ నాకు బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లే ఆఫర్ వస్తే తప్పకుండా వెళ్తా. బిగ్ బాస్ హౌస్‌తో పాటు.. నాగార్జున కూడా బాగా నచ్చారు.

ఆడిషన్స్‌లో భాగంగా నన్ను ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అయితే అడగలేదు. కాని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమన్నారు. ఒకవేళ నేను ప్రెగ్నెన్సీగా ఉంటే.. మూడు నెలలు అక్కడ ఉండటం కష్టం అనే అభిప్రాయం వాళ్లు అది చెప్పారు. దాన్ని తప్పు అని చెప్పడం లేదు. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తరువాత ఒక్కరోజు వాళ్లు నన్ను కిడ్నాప్ చేసేశారు. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రసారం అయిన తరువాతే నన్ను బయటకు పంపారు’ అంటూ చెప్పుకొచ్చింది హేమ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu