గీత గోవిందం సినిమాతో కన్నడ నటి రష్మిక మందనా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2018లో విడుదలైన ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండతోపాటు నటి రష్మిక నటనకు మంచిపేరు వచ్చింది. ఈ చిత్రంలో వీరిద్దరి కెమీస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే తాజాగా ఈ సినిమాలో రష్మిక-విజయ్ లిప్‌లాక్ సన్నివేశాల గురించి ప్రముఖ నటి హరిప్రియ కామెంట్ చేస్తుంది. ప్రస్తుతం హరిప్రియ ‘ఎల్లిదే ఇల్లితనకా’ అనే కన్నడ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నందున సినిమా ప్రమోషన్స్‌లో నటి హరిప్రియ బిజీగా ఉన్నారు.
ఈ సినిమాలో హీరో సృజన్, తనకు మధ్య ఓ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు. తాజాగా ‘ఎల్లిదే ఇల్లితనకా’ చిత్రంలోని ముద్దు సన్నివేశాన్ని ‘గీత గోవిందం’లోని ముద్దు సన్నివేశంతో ప్రేక్షకులు పోల్చి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హరిప్రియ స్పందించి.. ”గీత గోవిందం’ సినిమాలో రష్మిక-విజయ్ దేవరకొండల మధ్య లిప్ లాక్ సీన్ జరిగింది. కానీ నేను నటించిన ‘ఎల్లిదే ఇల్లితనకా’ సినిమాలో మా మధ్య మామూలు ముద్దు సన్నివేశం మాత్రమే జరిగింది.’ అని హరిప్రియ క్లారిటీ ఇచ్చారు.