HomeTelugu Newsవర్మ లాంటి వ్యక్తి నా జీవితంలో ఉంటేనా.. గాయత్రి గుప్తా షాకింగ్‌ కామెంట్స్‌

వర్మ లాంటి వ్యక్తి నా జీవితంలో ఉంటేనా.. గాయత్రి గుప్తా షాకింగ్‌ కామెంట్స్‌

10 23
‘ఫిదా’, ‘సీతా ఆన్ ది రోడ్’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్తా. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని విషయాలను బయటపెట్టింది. రామ్‌ గోపాల్‌ వర్మ లాంటి మంచి వ్యక్తిని తాను ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడలేదంది. వర్మ తనకంటే వయసులో ఎంతో పెద్దవారైపోయారని, లేకుంటే ఆయన్ని పెళ్లి చేసుకునేదాన్ని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శ్రీరెడ్డి చెప్పినట్టు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పడం వల్లే తనకు అవకాశాలు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. వర్మ తనకు ‘ఐస్‌క్రీం-2’ సినిమాలో అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకుంది గాయత్రి. ఆయనతో పనిచేస్తుంటే మారథాన్‌లో పాల్గొంటున్నట్టే ఉంటుందని చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu