సినీ ఇండస్ట్రీలో అవకాశం దొరకడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. చాలా కష్టపడాలి. అంతకు మించి అదృష్టం ఉండాలి. అన్నింటికంటే..ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించే వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. ఒక్కసారి పరిచయం చేసుకోవడం మొదలుపెడితే అవి ఎక్కడిదాకా వెళ్తాయో అందరికి తెలిసిందే. నెపోటిజం, మీటు వంటివి దాటుకుంటూ వెళ్ళాలి. ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకూడదు. అంతిమ లక్ష్యం సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
బాలీవుడ్‌లో హీరోయిన్ కావాలని స్వీడన్ నుంచి ముంబై వచ్చింది ఎల్లి. ముంబై వచ్చిన కొత్తలో తెలిసిన వ్యక్తి ద్వారా ఇద్దరు దర్శకులను కలిసింది. పరిచయం చేసుకొని వారు షేక్ హ్యాండ్ ఇచ్చారట. అంతేకాదు షేక్ హ్యాండ్ ఇచ్చి.. వేలితో గోకారట. దాని అర్ధం ఏంటో ఆ అమ్మడికి తెలియదు. జరిగిన విషయాన్ని తెలిసిన వ్యక్తికి చెప్తే.. బాలీవుడ్ భాషలో తనతో గడపాలని అర్ధం అని చెప్పింది. అవి పట్టించుకోకుండా తాను నటిగా ఎదిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నది ఎల్లి.