నటి అసిన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ బాగున్న సమయంలోనే బడా వ్యాపారవేత్త, మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె నటనకు దూరమైంది. 2016లో పెళ్లైనప్పటి నుంచి అసిన్ బయట ఎక్కువగా కనిపించలేదు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త ఫోటోలు డిలీట్ చేసి వార్తల్లో నిలిచింది. భర్త రాహుల్ తో ఆమెకు పడటం లేదని, ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని, అందుకే ఫొటోలను డిలీట్ చేసిందంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ విషయమై అసిన్ స్పందించింది. అవన్నీ పుకార్లే అని తెలిపింది. భర్తతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. తాను భర్తతో కలిసి విహార యాత్రలో ఉన్నానని చెప్పింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పేస్ కోసమే ఫొటోలను డిలీట్ చేసినట్లు స్పష్టం చేసింది. గతంలో తమ పెళ్లి ముంగిట కూడా ఇద్దరం బ్రేకప్ అయినట్టు ఇలానే పుకార్లు వచ్చాయని తెలిపింది. ఇప్పుడు విడాకులకు స్పందించేందుకు ఐదు నిమిషాల సమయం వృథా చేసినందుకు బాధగా ఉందని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ టీజర్