HomeTelugu Big Storiesఘనంగా అర్చన ఎంగేజ్‌మెంట్‌

ఘనంగా అర్చన ఎంగేజ్‌మెంట్‌

2 3నటి అర్చన ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ మధ్యే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫోటోలతోనే తాను ప్రేమలో ఉన్నానని చెప్పకనే చెప్పింది అర్చన. ఇప్పుడు నిశ్చితార్థం కూడా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. జగదీష్ అనే కుర్రాడితో వేద ఏడడుగులు నడవబోతుంది. తన నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటోను అర్చన ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. త్వరలోనే అందరికీ గ్రేట్ న్యూస్ చెప్పబోతున్నానని.. అప్పటి వరకు ఈ మూమెంట్స్‌ను మీరు కూడా ఎంజాయ్ చేయండని పోస్ట్ చేసిన ఈమె.. ఇప్పుడు ఆ న్యూస్ చెప్పేసింది.

తన జీవితంలో ఓ వ్యక్తి ఉన్నాడని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన అర్చన.. ఇప్పుడు అతన్ని అందరికీ చూపించేసింది. అక్టోబర్ 3న బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో వీళ్ళ ఎంగేజ్‌మెంట్ జరిగింది. దీనికి సుమంత్, నవదీప్, శివబాలాజీ, మధుమిత వచ్చారు. ఓ లీడింగ్ హెల్త్ కేర్ కంపెనీని రన్ చేస్తున్నాడు జగదీష్.

2a

ఇదిలా ఉంటే 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ,తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా అందరికీ గుర్తుండిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu