టాలీవుడ్ నటి, బిగ్‌బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ అర్చన వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హెల్త్‌కేర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు వివాహబంధంలో అర్చన-జగదీశ్ ఒక్కటయ్యారు. వివాహానికి ముందు బుధవారం రాత్రి ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్‌లో రిసెప్షన్‌ను నిర్వహించారు. దీనికి కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అర్చన-జగదీశ్ నిశ్చితార్థం కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అక్టోబర్3న జరిగిన విషయం తెలిసిందే.
క్లాసికల్ డ్యాన్సర్ అయిన అర్చన 2004లో ‘తపన’ సినిమాతో తెలుగు పరిశ్రమకు నటిగా పరిచయం అయ్యారు. ‘నేను’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘శ్రీరామదాసు’, ‘పౌర్ణమి’, ‘సామాన్యుడు’ తదితర చిత్రాల్లో ఆమె మెరిశారు. ఆమె చివరిసారి ‘వజ్ర కవచధర గోవిందా’ సినిమాలో వెండితెరపై కనిపించారు.