ప్రముఖ నటి అనుష్క సన్నబడటం కోసం అమెరికా వెళ్లిందట.. సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ ల్యూక్ కౌటిన్హో ఆమెను నాజూకు సుందరిగా మార్చేశారు. ఓ అందమైన బీచ్ తీరంలో ఇటీవల అనుష్క ఫొటోషూట్‌కు సంబంధించిన స్టిల్స్‌ను ఆయన షేర్ చేశాడు కూడా. ప్రముఖ ఫొటోగ్రాఫర్ సుందర్ రాము అందాల అనుష్కను మెరుపుతీగలా తీర్చిదిద్దారు. అప్పట్లో స్వీటీ ఫొటోలు వైరల్‌గా మారాయి. సముద్రపు అలల చెంత బొద్దుగుమ్మ అనుష్క.. సన్నని నాజూకు అందాల సుందరిగా మారి తెల్లని డ్రెస్‌లో ప్రకృతి అందాలతో పోటీ పడింది. అయితే ఇది ఫిబ్రవరి నెలలో మాట. ఆ ఫొటోలు అనుష్క పోజులిచ్చి ఆర్నెళ్లు గడిచింది. మరి ఇప్పుడు అనుష్క లుక్ చూస్తే.. అనుష్క ఏంటి ఇలా ఉంది అనుకుంటారు.
అనుష్క తాజాగా ‘సైలెంట్’ (ప్రచార టైటిల్) సినిమా అమెరికాలో షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్‌లో పాల్గొని మంగళవారం నాడు హైదరాబాద్ వచ్చింది అనుష్క. అయితే ఆమె లుక్ చూసిన కొంత మంది అనుష్కలా ఉందే అనుకున్నారు తప్ప ఆమె అనుష్క అని గుర్తుపట్టడానికి చాలా టైం పట్టిందట.
‘సైజ్ జీరో’ నాటి అనుష్కను తలపిస్తూ భారీదేహంతో దర్శనం ఇచ్చింది అనుష్క. మేకప్ లేకుండా మరీ లావుగా ఉన్న అనుష్క బల్కీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక అనుష్క చిత్ర విషయానికి వస్తే.. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘సైలెన్స్, నిశ్శబ్దం అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించబోతున్నారు.