యాంకర్, నటి అనసూయ ఎప్పుడూ ఏదో వివాదంలో చిక్కుకుంటుంది. ప్రస్తుతం అనసూయపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.
అనసూయ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిందని బన్నీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ తన డ్యాన్స్ గురించి ఫ్యాన్స్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని.. ఏమైనా తప్పులుంటే తన తర్వాత సినిమాలో వాటిని కరెక్ట్ చేసుకుంటారని అనసూయ అన్నట్టుగా వార్తలు వచ్చాయి.
అలాగే అల్లు అర్జున్ పుష్ప సినిమాల కొన్ని తప్పులు చేశాడని.. వాటిని పుష్ప2 సినిమాలో రిపీట్ కాకుండా చూసుకుంటున్నారని అనసూయ చెప్పినట్లు వార్తలు
దీనిపై నటి అనసూయ స్పందిస్తూ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. నేను బన్నీ గురించి అలా అనలేదు అంటూ వివరణ ఇచ్చింది. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనసూయ మండిపడుతోంది.