80వ దశకంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సినీ తారలు ఏటా ఏదో ఒక చోట కలిసి సందడి చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈసారి ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికైంది. ఈ సంబరాలకు సంబంధించి ఇప్పటికే చిరు తన ఇంటిని అంతా సిద్ధం చేశారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో 80ల నాటి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటులు ఒక చోట కలిసి సందడి చేశారు.
వీరిలో చిరంజీవి, మోహన్‌లాల్, రజనీకాంత్, వెంకటేష్, భాను చందర్, నరేష్, సురేష్, జయసుధ, రాధిక, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్, జాకీ ష్రాఫ్, రెహమాన్, ప్రభు తదితరులు పాల్గొన్నారు. స్కిట్‌లు, ర్యాంప్ వాక్‌లు, విచిత్ర వేషధారణలతో సందడి చేస్తారు. ఇప్పటికే పలువురు నటులు హైదరాబాద్ చేరుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.