HomeTelugu Trendingధైర్యంతోనే కరోనా వైరస్‌ను ఎదుర్కోగ‌లం

ధైర్యంతోనే కరోనా వైరస్‌ను ఎదుర్కోగ‌లం

Vishal shares hisప్ర‌ముఖ హీరో విశాల్, ఆయన తండ్రి జి.కె.రెడ్డి క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే..ఈ సంద‌ర్భంగా విశాల్ ఓ వీడియో విడుద‌ల చేశాడు.విశాల్ మాట్లాడుతూ – “నాన్న గారికి జూన్‌లో క‌రోనా పాజిటీవ్ వ‌చ్చింద‌ని ఈ మ‌ధ్య కాలంలో ఒక వీడియో పెట్టాను. మా నాన్న గారికి 82 సంవ‌త్స‌రాలు. ఈ వ‌య‌సుతో ఆయ‌న‌ను హాస్ప‌ట‌ల్లో జయిన్‌ చేయాల‌నే ఆలోచ‌న అస్స‌లు లేదు. ఇంట్లోనే ఉంచి ఆయ‌న‌ను బాగా చూసుకోవాల‌నేదే నా కోరిక. అందుకే నేనే దగ్గ‌రుండి ఆయ‌న‌ను చూసుకున్నాను. ఆ క్ర‌మంలో నాకు అవే ల‌క్ష‌ణాలు నాకు క‌నిపించాయి. దాంతో టెస్ట్ చేయించుకుంటే నాకు క‌రోనా పాజిటీవ్ అని తేలింది. నాతో పాటు నాకు ద‌గ్గ‌ర‌గా ఉండే మా మేనేజ‌ర్ కి కూడా పాజిటీవ్ వ‌చ్చింది. మా అంకుల్‌ డాక్ట‌ర్ హరిశంకర్ గారి స‌‌మ‌క్షంలో మేము ఆయుర్వేదిక్‌, హోమియోప‌తి మెడిసిన్ తీసుకున్నాం.” ఈ కోవిడ్ స‌మ‌యంలో అన్నింటిక‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే మ‌నం వేసుకునే మందుల‌కంటే ముందు మ‌న‌లో భ‌యం ఉండ‌కూడ‌దు. ఆ భ‌యం చాలా అన‌ర్ధాల‌కు దారి తీస్తుంది. అందుక‌నే ముందు దైర్యంగా ఉండండి. మ‌నం త‌ప్ప‌కుండా ఈ వైర‌స్‌ని ఎదుర్కోగ‌లం మ‌నం మ‌న‌సులో త‌లుచుకోండి అని వివరించాడు విశాల్. దైర్యంగా ఉండండి తప్ప‌కుండా మ‌నం ఈ క‌రోనాను జ‌యించ‌గలం అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu