టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు సెలబ్రెటీలంతా రక్తదానం చేయడంనికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవితో పాటు హీరో శ్రీకాంత్, నాని, నటి హేమ ఇలా పలువురు రక్త దానం చేసారు. తాజాగా నటుడు ఉతేజ్ కూడా రక్తదానం చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య పద్మ చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కి వచ్చి రక్తదానం చేశారు. తన
ఆత్మీయ స్నేహితులు మరో ఎనిమిది మంది చేత కూడా రక్తదానం చేయించారు. ఈసందర్భంగా ఉతేజ్ మాట్లాడుతూ … ఇలాంటి విపత్కర సమయంలో అందరు ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని, చిరంజీవిగారి ఆలోచన చాలా గొప్పదని ఉత్తేజ్ ప్రశంసించారు. అదేవిధంగా ‘సీసీసీ’ కి సాయం చేస్తున్న అందరికీ
ఉతేజ్ కృతజ్ఞతలు తెలిపారు.