Homeతెలుగు Newsశివాజీ '90's వెబ్‌సిరీస్‌ టీజర్‌

శివాజీ ’90’s వెబ్‌సిరీస్‌ టీజర్‌

actor shivaji 90s teaser

టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు శివాజీ. ఈ టాలెంటెడ్‌ యాక్టర్ చాలా కాలం తర్వాత ’90’s’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. Middle Class Biopic ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ టీజర్‌ను విక్టరీ వెంకటేశ్ లాంఛ్ చేశాడు.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన చంద్రశేఖర్‌ (శివాజీ) చుట్టూ తిరిగే కథాంశంతో సాగనున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్‌. మధ్యతరగతి కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలతో వినోదాత్మకంగా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది.

ఆదిత్య హాసన్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వాసంతిక, రోహన్‌, స్నేహల్ కామత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమోఘా ఆర్ట్స్‌, ఎంఎన్‌వో ప్రొడక్షన్స్‌ బ్యానర్లపైనవీన్‌ మేడారం, రాజశేఖర్ మేడారం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బలి సంగీతం అందిస్తున్నాడు. ఈ వెబ్‌ సిరీస్‌ ETV Win లో జనవరి 5న ప్రీమియర్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu