HomeTelugu Trendingకనిపించని నాలుగో సింహాం గురించి చెప్పిన సాయికుమార్‌

కనిపించని నాలుగో సింహాం గురించి చెప్పిన సాయికుమార్‌

12
కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో నటుడు సాయికుమార్‌ ఓ విడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం.. ఇది మన సంస్కారం. కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహామే మీరు.. మీరు అంటే మనం.. మనం అంటే దేశం. ‘దేశం అంటే మట్టి కాదోయ్‌ దేశమంటే మనుషులోయ్’‌. దేశం మనకేం చేసిందాని కంటే దేశానికి మనం ఏం చేసామన్నదే ముఖ్యం. ఈ రోజు మనం గొప్ప సేవ చేయాల్సిన అక్కర్లేదు. మన ఇళ్లలో మనం కూర్చుంటే చాలు. ప్రభుత్వం ఇస్తున్న సూచనలను పాటిస్తూ.. స్వీయ నియంత్రణతో శుభ్రతతో క్రమశిక్షణతో మీ తల్లిదండ్రులతో మీ భార్యా పిల్లలతో మీ కుటుంబాలతో మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉంటే చాలు అన్నాడు.

మీరు బతకండి మిగతావారిని బతకనివ్వండి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మనమందరం కలిసికట్టుగా దేశం కోసం ప్రపంచం కోసం పోరాడుదాం. కరోనా అనే వైరస్‌ను తరిమికొడదాం. ఆ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడుదాం. సర్వేజనా సుఖినోభవంతు’ అంటూ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలను కోరాడు. ఈ మేరకు ఓ వీడియో రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక కరోనాపై పోరాటంలో భాగంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రజల్లో కరోనా వైరస్‌పై అవగాహ కల్పించడానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu