తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కజగం పేరుతో ఆయన సొంత పార్టీని ప్రారంభించారు. ఈక్రమంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై సినీ నటుడు రంజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతోనే విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన ఆరోపించారు. విజయ్ లాంటి వాళ్లు వెయ్యి మంది వచ్చినా తమిళనాడులో మార్పు తీసుకురాలేరని చెప్పారు.
ఓటుకు రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు డబ్బులు పంచే వారిని ప్రజలు గెలిపించకూడదని రంజిత్ అన్నారు. రాష్ట్రంలో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలు ఎన్నికలను బహిష్కరించకుండా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో స్వలాభం కోసం కొందరు పార్టీలు మారుతుంటారని దీనికి విజయధరణి మంచి ఉదాహరణ అని చెప్పారు.
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి మద్యం అమ్మకాలను తగ్గిస్తామని చెపుతుంటారని కానీ, విక్రయాలను పెంచుకుంటూనే పోతున్నారని మండిపడ్డారు. సినీ నటి త్రిష వ్యవహారంలో ఎవరినీ తప్పుపట్టలేమని చెప్పారు.