HomeTelugu Newsవిలన్‌ పాత్రలు చేస్తానంటున్న విజయ్‌ దేవరకొండ ఫ్రెండ్‌

విలన్‌ పాత్రలు చేస్తానంటున్న విజయ్‌ దేవరకొండ ఫ్రెండ్‌

8 12

నటుడు ప్రియదర్శి… తాజా ఓ ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ .. ” పాత్రలకి నేను ప్రాధాన్యతనిస్తూ నటిస్తున్న. దాంతో అంతా ‘మీరు కమెడియన్ నా.. కేరక్టర్ ఆర్టిస్ట్ నా.. అని అడుగుతున్నారు. అన్నిరకాల పాత్రలను నేను చేయగలనని నిరూపించుకోవాలని నాకు ఉంది. అందుకే విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నాను. కామెడీ చేయడం చాలా తేలికని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి కామెడీ చేయడమే చాలా కష్టం. విలన్ పాత్రలు చేయాలని వుంది. నటుడిగా నిరూపించుకోవాలంటే అన్నిరకాల పాత్రలు చేయాలనేదే నా ఉద్దేశం. అని ప్రియదర్శి చెప్పుకొచ్చారు.

విజయ్‌ దేవర నటించిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాదర్శి వరుస ఛాన్స్ లతో మంచి జోష్ మీద ఉన్నాడు. కమెడియన్ గా నవ్విస్తూనే, మరో వైపున కీలకమైన పాత్రలను కూడా పోషిస్తున్నాడు. ఆ మధ్య మల్లేశం సినిమా లో హీరోగా నటించి మెప్పించాడు ప్రియదర్శి. తాజాగా లూజర్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu