పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా నటించిన యువ నటుడు నందురీ ఉదయ్‌కిరణ్ (34) హఠాన్మరణం చెందాడు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుతో అతడు మరణించాడు. ఉదయ్‌కిరణ్ పార్థివ దేహానికి పలువురు రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారుపలు తమిళ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్నారు. 2016లో జూబ్లీహిల్స్‌లోని ఓవర్ ద మూన్ పబ్‌లో గొడవ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఉదయ్ కిరణ్ పలు నేరాలకు పాల్పడినట్టు అప్పట్లో పోలీసులు గుర్తించారు.