టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్ నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన ఈ ఉదయం స్నానాల గదిలో కుప్పకూలి మరణించారు. విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా నటించి మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశీలి జయప్రకాశ్ రెడ్డి మృతితోసినీఇండస్ట్రీని విషాదంలో మునిగిపోయింది. రంగస్థల నటుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలంలోని శిరువెళ్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జయప్రకాశ్ నారాయణ చిన్నతనం నుంచే నాటకాలపై ఆసక్తి కనబరిచేవారు. 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు.