‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఎలక్షన్స్ చాలా ఆసక్తికరంగా మారాయి. ఈ తరుణంలో చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ‘మా’ ఎన్నికల కోసం రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? ఎవరికీ అందని ఈ ఊహను తన కామెడీ టైమింగ్‌తో తెర మీదకు తెచ్చాడు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ నటుడు బ్రహ్మాజీకి ఏకంగా షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, కరోనా జాగ్రత్తతో మన నటుడు మర్యాదపూర్వకంగా ఆ షేక్‌హ్యాండ్‌ను తిరస్కరించి.. నమస్తే పెట్టాడు.
పైగా ఆ ఫొటోలో జింగ్ పిన్ కనీసం మాస్క్ లేకుండా ఉన్నాడు. నిజానికి ఇది జింగ్ పిన్ పాత ఫొటోనే. అయినా ఎడిటింగ్ దానిని ప్రజెంట్ చేశాడు బ్రహ్మాజీ. ‘‘క్యాజువల్ మీట్.. ఎలాంటి రాజకీయాలు లేవు. కాకపోతే మా ఎన్నికల గురించి చర్చించాం. జింగ్ పిన్ కొన్ని సలహాలు ఇచ్చాడు. అలాగే..’’ అంటూ ఫన్నీ ఎమోజీతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బ్రహ్మాజీ.