HomeTelugu Trendingశ్రీలీల గురించి బ్రహ్మాజీ మనసులో ఉన్నదేంటి?

శ్రీలీల గురించి బ్రహ్మాజీ మనసులో ఉన్నదేంటి?

Brahmajee about Sree leela 1

నటుడు బ్రహ్మాజీకి కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరుంది. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు ‘ ఓ పిట్టకథ’ సినిమా ద్వారా టాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. అతడి రెండో సినిమా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ రూపొందిస్తున్నారు. ఈ సినిమా జులై 29న రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో బ్రహ్మాజీ కూడా బిజీగా ఉన్నాడు.

తన కొడుకు సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “మళ్లీ మీకు హీరోగా చేసే ఛాన్స్ వస్తే, ఏ హీరోయిన్ మీ పక్కన చేయాలనుకుంటారు?” అని అడిగితే “శ్రీలీల అయితే బాగుంటుందని అనుకుంటున్నాను అన్నాడు.

Slum Dog Husband

ఎందుకంటే శ్రీలీల డాన్స్ చాలా బాగా చేస్తుంది. నాకు రాదనుకుంటున్నారేమో, నాకు కూడా డ్యాన్స్ చాలా బాగా వచ్చు అన్నాడు. “శ్రీలీల చాలా ఫాస్టుగా స్టార్ డమ్ ను అందుకుంది. ఆమె ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటే, జయప్రద – శ్రీదేవి రేంజ్ కి వెళుతుందని మొన్నీమధ్య ఒక పెద్ద ప్రొడ్యూసర్ నాతో అన్నారు అన్నాడు బ్రహ్మాజీ.

మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈవెంటుకి శ్రీలీల వస్తుంది. అప్పుడు ఆమెతో కలిసి డాన్స్ చేస్తాను అంటూ తన మనసులోని కోరికను బయట పెట్టాడు బ్రహ్మాజీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu