HomeTelugu Trendingవివాదాస్పద వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన నటుడు

వివాదాస్పద వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన నటుడు

Actor bhagya raj apologize
పుస్తకావిష్కరణ వేదికగా సినీ సీనియర్‌ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్‌ నోరు జారి వార్తల్లోకి ఎక్కారు. విమర్శలు, ఎదురు దాడి పెరగడంతో పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సి వచ్చింది. బుధవారం మోడీ సంక్షేమ పథకాలు, నవభారతం –2022 పుస్తకావిష్కరణ చెన్నైలో జరిగింది. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు భాగ్యరాజ్‌ పాల్గొని సినీ స్టైల్లో డైలాగుల్ని పేల్చారు. ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే వాళ్లంతా నెల తక్కువ పుట్టిన వాళ్లేనని ఎద్దేవా చేశారు.

నెల తక్కువగా పుట్టిన వాళ్లను, ప్రత్యేక ప్రతిభావంతుల్ని గురి పెట్టి ఆయన వ్యాఖ్యలు చేశారనే ప్రచారంతో సోషల్‌ మీడియాల్లో భాగ్యారాజ్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సాయంత్రానికి మీడియా ముందుకు వచ్చిన భాగ్యరాజ్‌ ‘తాను బీజేపీ వ్యక్తిని కాదని…తమిళుడిని అని వ్యాఖ్యానించారు. నెల తక్కువ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, తాను దురుద్దేశంతో ఆ వ్యాఖ్య చేయలేదని, ప్రసంగ వేగంలో ఆ పదాన్ని ఉపయోగించినట్టుగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరి మనస్సునైనా నొప్పించి ఉంటే క్షమించండి అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

‘అంటే సుందరానికీ’ టీజర్‌ వచ్చేసింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu