కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కుటుంబ సభ్యలు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ్ కాంత్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీఎండీకే ఓ ప్రకటనలో పేర్కొంది. విజయ్ కాంత్ గతేడాది కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.