సినీ నటుడు అలీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. 15 నిమిషాల పాటు సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇద్దరూ రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అలీ సీఎంను కలవడం ఇది రెండో సారి. టీడీపీ తరఫున గుంటూరు టికెట్‌ను అలీ ఆశిస్తున్నారు. ఆయన త్వరలోనే టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
గతంలో వైసీపీ అధినేత జగన్‌ను అలీ కలిసారు. అప్పట్లో వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ట్విస్ట్ ఇస్తూ అలీ జనసేన అధ్యక్షుడు పవన్‌ను కలిశారు. తర్వాత చంద్రబాబును కలిశారు. దీంతో మన కామెడీ హీరో అలీ ఏ పార్టీలో చేరుతున్నారో జనాల్లో కొంత కన్ ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఇప్పుడు మరోసారి చంద్రబాబును కలవడంతో దాదాపు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు అర్ధమవుతోంది.