సినీయర్ నటుడు అబ్బాస్ 2015 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు.. విదేశాలకు వెళ్లి అక్కడ సెటిలైపోయాడు. అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నాడు. ఇలా చాలా రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అబ్బాస్.. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో తనకి ఏమైందని అంతా ఆరా తీస్తున్నారు.
గత కొన్ని రోజులుగా అబ్బాస్ కాలి నొప్పితో బాధపడుతున్న అతనికి వైద్యులు సర్జరీ చేశారు. ఇదే విషయాన్ని చెబుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆందోళన పడ్డానని.. భయం వేసిందని రాసుకొచ్చాడు అబ్బాస్. నా భయాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించా. నా మనస్సు దృఢంగా ఉంచుకునేందుకు చాలా ట్రై చేశా. నాకు సర్జరీ జరిగింది. ప్రస్తుతం బాగానే ఉన్నా సర్జరీ తర్వాత కొంత ఉపశమనం కలిగింది అంటూ ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. అబ్బాస్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.