HomeTelugu Trendingబొక్క బోర్లాపడ్డా ..తన పెళ్లిపై చిరు ఫన్నీ కామెంట్స్

బొక్క బోర్లాపడ్డా ..తన పెళ్లిపై చిరు ఫన్నీ కామెంట్స్

Chiranjeevi Gives Expensive Gift His Sister

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రొమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చిరంజీవి, రాంచరణ్, కొరటాల శివ లని ఇంటర్వ్యూ చేశారు… తాను, రాంచరణ్ కలిసి నటించాలనేది సురేఖ కోరిక అని చిరంజీవి గతంలో కూడా చెప్పారు.

దీనిపై చిరంజీవి మాట్లాడుతూ … నేను పాలిటిక్స్ లోకి వెళ్ళాక సురేఖ చాల బాధపడుతూ ఉండేది. రాంచరణ్ తో మీరు కంప్లీట్ గా ఒక సినిమాలో నటిస్తే బావుండేది.. కానీ మీరు పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు అని అంటూ ఉండేది. నేను తిరిగి రి ఎంట్రీ ఇచ్చాక ఇప్పుడు ఇలా మేమిద్దరం కలిసి ఆచార్యలో నటించాం అని చిరంజీవి అన్నారు. అమ్మది బలమైన కోరిక అని రాంచరణ్ తెలిపాడు.. వెంటనే చిరు అందుకుని చాలా బలమైన కోరిక నాన్నా.. తను అనుకుంటే అయిపోతుంది. మనవూరి పాండవులు చిత్రం చూసి ఎవరీ సైకిల్ అబ్బాయి చాలా బావున్నాడే అని అనుకుందట.. అంతే ఫినిష్ .. బొక్క బోర్లా పడ్డాను. ఆ టైం లో నేను అప్పుడే పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటాను. కానీ అయిపోయింది అని చిరు ఫన్నీ కామెంట్స్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu