Jagan in Assembly:
2024 లో జరిగిన ఎన్నికలలో.. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. అతి దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసింది. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్న వైసిపి.. కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా అందుకోలేకపోయింది. ముఖ్యమంత్రి పదవి నుంచి విరమణ ఇచ్చిన జగన్.. ఈమధ్య అసలు అసెంబ్లీ జోలికి రావడం లేదు.
ఈనెల 22వ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బడ్జెట్ కి సంబంధించిన సమావేశాలు జరగనున్నాయి. జగన్ ఈ సమావేశాలకు కూడా హాజరు కావడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. మరోవైపు జగన్ ప్రజా దర్బార్ ను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర లాంచ్ చేసి.. అక్కడ పార్టీ లీడర్లు వర్కర్లతో మాట్లాడాల్సింది. కానీ జగన్ అది కూడా చేయడానికి ముందుకు రావడం లేదు.
ఎన్నికల సమయంలో స్ప్రేయిన్ అయిన తన కాలు చికిత్స కోసం.. జగన్ ఒకటి రెండు రోజుల్లో.. బెంగళూరు వెళ్ళనున్నారు. ఇప్పటికే జూన్లో కూడా జగన్ బెంగళూరు వెళ్లి పది రోజులు ఉన్నారు. పులివెందులలో కంటే బెంగళూరులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇప్పుడు రెండు వారాలు వ్యవధిలోనే మళ్లీ బెంగళూరు వెళ్ళనున్నారు.
దీంతో బడ్జెట్ సమావేశాలకు కూడా జగన్ రాకపోవచ్చు అని కొందరు అంటున్నారు. అయితే జగన్ కావాలని అసెంబ్లీ సమావేశాలకి రావడం లేదని తెలుస్తోంది. తనకి మొదటి కారణం కేవలం ఒక ఎమ్మెల్యేగా జగన్ కి అసెంబ్లీకి రావాలని లేదట. ఇప్పటికే ప్రతిపక్ష హోదా కోసం కష్టపడ్డారు కానీ అది కూడా అదే దక్కలేదు.
మరోవైపు అసెంబ్లీ మొత్తం కూటమి లీడర్లు మాత్రమే ఉంటారు. అటు తెలుగుదేశం పార్టీ.. ఇటు జనసేన లీడర్లు అసెంబ్లీలో కనిపిస్తారు. వారి మధ్య వెళ్లి జగన్ కి మాట్లాడాలని లేదట. అందుకే కావాలనే అసెంబ్లీ సమావేశాలకు రావడంలేదని తెలుస్తుంది. అయితే మరొకవైపు మాత్రం ప్రజలు.. ఎన్నాళ్ళని జగన్ అసెంబ్లీ నుంచి తప్పించుకుంటాడు.. ఇలా భయపడుతూ ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.