బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్.. తన తండ్రి అమితాబ్ బచ్చన్‌ను ఉద్దేశించి ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. బిగ్‌బి ఆదివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అభిషేక్ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు.
‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్న నా తండ్రికి ధన్యవాదాలు. మీరే నా స్ఫూర్తి, నా హీరో. మిమ్మల్ని చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది. లవ్ యూ’ అని అభిషేక్ పోస్ట్ పెట్టారు. అలాగే తల్లిదండ్రులతో దిగిన ఫొటోను షేర్ చేసిన అభిషేక్.. ‘ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురమైన జ్ఞాపకం’ అని పేర్కొన్నారు. దీంతో ఆయన షేర్ చేసిన పోస్ట్‌లపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. బిగ్‌బికి అభినందనలు తెలిపారు.
చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం జరిగింది. ఈ వేడుకలో భాగంగా జాతీయస్థాయి ఉత్తమనటిగా ‘మహానటి’లో నటించిన కీర్తి సురేశ్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా అవార్డులను సొంతం చేసుకున్నారు. అయితే, ఆ సమయంలో జ్వరంతో ఇబ్బందిపడుతున్న అమితాబ్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. దీంతో బిగ్‌బికి ఆదివారం ప్రత్యేకంగా అవార్డును అందించారు. అంతేకాకుండా జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న నటీనటులకు, టెక్నీషియన్స్‌కు రాష్ట్రపతిభవన్‌లో రామ్‌నాథ్ కోవింద్ నిన్న సాయంత్రం తేనీటి విందు ఏర్పాటు చేశారు.
T 3592/3/4/5 – .. my immense gratitude and respect for this moment ..🙏 pic.twitter.com/WavW3Hwkjw
— Amitabh Bachchan (@SrBachchan) December 29, 2019