HomeTelugu Big Storiesఅభిషేక్‌ని నటించడం మానేసి వడాపావ్‌ వ్యాపారం చేసుకోమన్న నెటిజన్‌

అభిషేక్‌ని నటించడం మానేసి వడాపావ్‌ వ్యాపారం చేసుకోమన్న నెటిజన్‌

బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌కు తరచూ సోషల్‌మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గత కొంత కాలంగా అభిషేక్‌ కెరీర్‌లో సరైన హిట్లు లేవు. ఈ మధ్యే ఆయన నటించిన ‘మన్మర్జియా’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం కూడా అభిమానులను నిరాశ పర్చడంతో నెటిజన్లు అభిషేక్‌ ని విమర్శిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు. ఇలా కామెంట్‌ చేసిన వారిలో హర్షవర్ధన్‌ కాలే అనే వైద్యుడు కూడా ఉన్నాడు.

9 23

హర్షవర్ధన్‌ అభిషేక్‌ని అవమానిస్తూ ‘మన్మర్జియా’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఎంత మంచి సినిమా అయినా సరే.. దానిలో అభిషేక్‌ బచ్చన్‌ నటిస్తే ఫ్లాప్‌ అవుతుంది. తాజాగా ఈ విషయం మరోసారి రుజువైంది. హిట్‌ సినిమాను.. ఫ్లాప్‌ చేసే టాలెంట్‌ అందరికీ ఉండదు. బంధుప్రీతికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అభిషేక్‌తో పాటు ఇతర స్టార్‌కిడ్స్‌ నటించడం మానేసి వడాపావ్‌ వ్యాపారం చేసుకోవాలి’ అంటూ ట్విటర్‌లో ఓ మెసేజ్‌ పెట్టాడు. అంతేకాక ‘స్త్రీ’ సినిమా మంచి విజయం సాధించింది. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతోంది ప్రతిభ ముఖ్యమని’ అంటూ హర్షవర్ధన్‌ ట్వీట్‌ చేశాడు.

అయితే సదరు వైద్యుడు చేసిన కామెంట్స్‌కి జూనియర్‌ బచ్చన్‌ తనదైన శైలీలో సమాధానం చెప్పాడు. ‘డాక్టర్‌ లాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మీరు అన్ని విషయాల గురించి తెలుసుకుని మాట్లాడితే మంచింది. ముందు మీరు బాక్సాఫీస్‌ లెక్కలు, నిజానిజాలు తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి. మీ దగ్గరకు వచ్చే పేషంట్సతో కూడా ఇలానే ప్రవర్తిస్తారా’ అంటూ అభిషేక్‌ ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్ల పరంపర ఇంతటితో ఆగలేదు. అభిషేక్‌ ట్వీట్‌కు హర్షవర్ధన్‌ ప్రతిస్పందిస్తూ..’మీరు ఇలాగే ఆశిస్తూ ఉండండి జూనియర్‌ బచ్చన్‌. ఇలా ట్వీట్‌ చేయడానికి నేనేం సిగ్గు పడటం లేదు. వరుసగా 16 ఫ్లాప్స్‌ ఇచ్చిన యాక్టర్లు సిగ్గుపడాలి. ఇండస్ట్రీలో బంధుప్రీతి రాజ్యమేలుతోంది కదా.. మీరు మంచి మనిషే కావచ్చు. కానీ భయంకరమైన యాక్టర్’ అంటూ రిట్వీట్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu