బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ‘భారతీయుడు 2’ చిత్రంలో నటించనున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ దర్శకుడు శంకర్ కాంబినషన్‌లో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా.. ఇందులో అభిషేక్ కీలక పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో అభికి పవర్‌ఫుల్ పాత్ర దక్కినట్లు తెలుస్తోంది.
తన పాత్ర గురించి వినగానే అభిషేక్ వెంటనే ఒప్పేసుకున్నారట. మరోపక్క బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. ఇందులో ఆయన విలన్ పాత్రలో నటించే అవకాశం ఉందట. ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాష్‌కరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రాబోతోంది.