టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో వారసుడు పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు చిన్న కుమారుడు, విక్టరీ వెంకటేష్ అన్న కొడుకు, హీరో రానా తమ్ముడైన దగ్గుబాటి అభిరామ్ సిల్వర్ స్ర్కీన్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైయ్యాడని ఫిల్మ్ నగర్‌లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో.. సురేష్‌బాబు “అసురన్” రిమేక్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇదే మూవీతో అభిరామ్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం సాగుతోంది.
గతంలోనే అభిరామ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై రకరాలుగా ప్రచారం జరిగింది. అయితే.. మొత్తానికి ఇప్పుడు అసురన్ మూవీలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన అసురన్ సంచలన విజయం సాధించింది.. అసురన్‌లో ధనుష్ పెద్ద కుమారుడి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రోల్ చుట్టూనే మూవీ అంతా తిరుగుతుంది. దీంతో ఆ రోల్ అభిరామ్ ఎంట్రీకి బాగుంటుందని భావిస్తున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.