HomeTelugu Trending'అభినేత్రి 2' టీజర్‌

‘అభినేత్రి 2’ టీజర్‌

9 14ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘అభినేత్రి 2’. నందితా శ్వేత, కోవై సరళ, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 2016లో వచ్చిన ‘అభినేత్రి’కి సీక్వెల్‌ ఇది. ఈ సినిమాను మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ‘దేవి 2’ టైటిల్‌తో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ‘దెయ్యమా.. అయ్యో దెయ్యమయ్యా.. ఒక్క దెయ్యం కాదు రెండు దెయ్యాలు..’ అంటూ కోవై సరళ తెగ భయపడుతూ కనిపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu