మెగా మేనల్లుడు అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏబీసీడీ’. అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంలోని ‘అమెరికా.. నా అమెరికా.. నిన్ను మిస్సవుతున్నా..’ అంటూ సాగుతున్న లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అమెరికాలో ఓ సంపన్న కుటుంబంలో పుట్టిన యువకుడు భారత్‌కు వచ్చి ఎలాంటి కష్టాలు పడ్డాడు? అన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని సంజీవ్ రెడ్డి తెరకెక్కించారు. రుక్సార్ ధిల్లన్ హీరోయిన్. మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘ఏబీసీడీ’ చిత్రానికి ఇది రీమేక్‌గా రాబోతోంది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మధురా శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగబాబు, మాస్టర్ భరత్‌లు కీలక పాత్రలు పోషించారు. మే 17న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.