ఓంకార్ యాంకర్‌గా వ్యవహరించిన ఆట డ్యాన్స్ రియాలిటీ షో చాలా పాపులరైన సంగతి తెలిసిందే.. .అయితే ఆట డ్యాన్స్ షో ఫస్ట్ సీజన్ విన్నర్‌గా నిలిచిన టీనా మృతిచెందారు.. . కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా గోవాలో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే నివసిస్తోంది.. చిన్నవయసులోనే టీనా మరణించడంతో ఆమె మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయాన్ని ఆట సందీప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. టీనా మరణవార్తను దిగ్భ్రాంతి చెందినట్టుగా చెప్పారు.
అయితే నాలుగైదు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన టీనా యాంకర్ శిల్పాచక్రవర్తిని కలిసిందని, తిరిగి డ్యాన్స్ షోల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఉందని మనసులోని మాట బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గోవా వెళ్లిపోయిన ఆమె ఇంట్లో ఉన్న సమయంలో మద్యం సేవించిందని, అయితే ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల ఆమెకు గుండెపోటు వచ్చిందని కుటుంబీకులు తెలుపుతున్నట్లుగా ఓ వార్త వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఇక, టీనా మృతిపై పలువురు నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.