HomeTelugu Big Storiesరాధేశ్యామ్‌ నుండి ‘ఆషికీ ఆ గయి’

రాధేశ్యామ్‌ నుండి ‘ఆషికీ ఆ గయి’

Aashiqui Aa Gayi Song from

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, నటి పూజాహెగ్డే నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘రాధేశ్యామ్‌’ నుంచి లవ్‌ ఆంథమ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. మొదట హిందీ వెర్షన్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ‘ఆషికీ ఆ గయి’ అంటూ సాగే ఈ వీడియో సాంగ్‌లో ప్రభాస్‌-పూజాల ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఫిదా చేసేలా ఉంది. మనసుని హత్తుకునేలా సాగిన ఈ ప్రేమగీతాన్ని అర్జీత్‌ సింగ్‌ ఆలపించారు. ‘రాధేశ్యామ్‌’ హిందీ వెర్షన్‌కు మిథున్‌ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే.

రాధాకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపించనున్నారు. పూజాహెగ్డే.. ప్రేరణ పాత్రలో సందడి చేయనున్నారు. భాగ్యశ్రీ, ప్రియదర్శి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu