పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు జూన్ 6న విడుదల కానుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం ఇతివృత్తంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ లంకేశుడిగా కనిపించనుండగా.. సన్నీ సింగ్, దేవదత్ నాగే ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.
సినిమా విడుదలకు ముందు బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్.. భూషణ్ కుమార్, ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, ఓం రౌత్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అమీర్ కంపెనీ అమీర్‌ఖాన్ ప్రొడక్షన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ షేర్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచిస్పందన వస్తున్నది. తొలిరోజే బంపర్ ఓపెనింగ్స్‌ను చిత్రం రాబట్టగలుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. గతంలో ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ‘తన్హా జీ – ది అన్‌సంగ్ వారియర్’ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి భారీగా వసూళ్లను రాబట్టింది. ఓం రౌత్ కెరియర్‌లో ‘ఆదిపురుష్’ రెండో చిత్రం కాగా.. ఈ చిత్రంపై భారీగానే ఆశలున్నాయి.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు