బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాను నటిస్తున్న లాల్ సింగ్ చధా సినిమా విడుదలయ్యేంత వరకు ఫోన్‌ను స్విచ్చాఫ్ చేయాలి అనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగత జీవితం, కెరీర్ రెండూ దేనికదే సెపరేట్‌గా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఫోన్ వల్ల ఏకాగ్రతగా షూటింగ్ చేయలేనని మొబైల్ స్విచ్ఛాఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఏదైనా అర్జంట్ పనైతే తన మేనేజర్‌కు కాల్ చేయమని బంధువులకు చెప్పి ఉంచాడట. అంతే కాదు, అమీర్ సోషల్ మీడియా అకౌంట్లను కూడా ప్రస్తుతం అతడి టీమే చూసుకుంటోందట. అయితే ఇదంతా లాల్ సింగ్ చద్దా షూటింగ్‌కు శుభం కార్డు పడేవరకు కాదు సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యేవరకు. ప్రస్తుతం లాల్ సింగ్ చధా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు అమీర్. ఈ చిత్రంలో కరీనాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.