విభిన్న కథాంశాలతో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే హీరో అమీర్‌ఖాన్. అందుకే ఆయనను మిస్టర్ ఫర్ఫెక్ట్ అంటారు అభిమానులు. ఎప్పుడూ డిఫరెంట్ లుక్‌లో కనిపించే అమీర్ ఇప్పుడు చాలా నేచురల్‌గా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఫాదర్స్ డే సందర్భంగా తన కుమార్తె ఐరా ఖాన్‌తో దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కొందరైతే అమీర్‌ను గుర్తుపట్టలేక పోయామంటూ కామెంట్స్ చేస్తున్నారు. సహజమైన ఫొటో చూసి అభిమానులు మెచ్చుకుంటున్నారు.