నటి ఆమని గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. శుభలగ్నం, మావి చిగురు, మిస్టర్ పెళ్లాం వంటి తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తోంది. ఆమని నట వారసురాలిగా ఆమె మేనకోడలు హృతిక వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది. బాల నటిగా 3 సినిమాల్లో నటించిన హృతిక హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
అభిలాష్ భండారి హీరోగా, హృతిక హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. జీవీకే డైరెక్షన్‌లో చక్ర ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై వెంకటరత్నం నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవీకే మాట్లాడుతూ.. “లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి యానాం, అమలాపురం, వైజాగ్, లంబసింగి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ ప్లాన్ చేశాం. సింధు కే ప్రసాద్ సంగీతం, జే. ప్రభాకర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి” అన్నారు.