పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. థియేటర్లలో విడుదలైన రోజు నుంచి సినిమా మాటల రచయిత మనోజ్ ముంతాషీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పేలవమైన గ్రాఫిక్స్ కంటే మెజారిటీ ప్రేక్షకులు ఆయన రాసిన డైలాగ్స్ పై పెదవి విరిచారు. ఒక వర్గం ప్రేక్షకులు సినిమాలోని డైలాగ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు.
దీనిపై సోషల్ మీడియాలోను, ఇంటర్వ్యూలలోను అనేక వివరణలు ఇచ్చిన మనోజ్ తాజాగా బేషరతుగా క్షమాపణ చెప్పారు. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసినందుకు హృదయపూర్వక క్షమాపణలు కోరారు.
‘ఆదిపురుష్ వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. చేతులు జోడించి నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్ బలి, మమ్మల్ని ఐక్యంగా ఉంచి, మన పవిత్రమైన సనాతన, మన గొప్ప దేశానికి సేవ చేయడానికి శక్తిని ప్రసాదించుగాక’ అని ట్వీట్ చేశారు.
मैं स्वीकार करता हूँ कि फ़िल्म आदिपुरुष से जन भावनायें आहत हुईं हैं.
अपने सभी भाइयों-बहनों, बड़ों, पूज्य साधु-संतों और श्री राम के भक्तों से, मैं हाथ जोड़ कर, बिना शर्त क्षमा माँगता हूँ.
भगवान बजरंग बली हम सब पर कृपा करें, हमें एक और अटूट रहकर अपने पवित्र सनातन और महान देश की…— Manoj Muntashir Shukla (@manojmuntashir) July 8, 2023