టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘అతిథి దేవోభవ’ సినిమా ఈనెల 7న థియేటర్స్‌లో విడుదలైన సందడి సంగతి తెలిసిందే. పొలిమేర నాగేశ్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా తాజాగా ఆది సాయికుమార్ ఇప్పుడు తన ఇంట్లోకి కూడా కొత్త కారును ఆహ్వానించాడు.
ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా భార్య, కూతురితో పాటు తండ్రి సాయికుమార్‌తో దిగిన ఫొటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆది సాయికుమార్ చేతిలో ఆర డజనుకు పైగా సినిమాలున్నాయి.