HomeTelugu Trendingతండ్రికి కటింగ్‌ చేసి డబ్బులు తీసుకున్న యంగ్‌ హీరో!

తండ్రికి కటింగ్‌ చేసి డబ్బులు తీసుకున్న యంగ్‌ హీరో!

3 16లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది ఇంటివద్దే ఎవరికి వాళ్లు హెయిర్ కటింగ్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కూడా తాజాగా ఇంటి వద్దే కటింగ్ చేయించుకున్నారు. ఆయన కొడుకు, యంగ్ హీరో ఆది పినిశెట్టి తండ్రికి చక్కగా ప్రొఫెషనల్ గా హెయిర్ కట్ చేశాడు. ఆ వెంటనే షేవింగ్ కూడా చేశాడు. ఇక్కడే ఓ తమాషా జరిగింది. కటింగ్ చేయడం అయ్యాక తన ఫీజు ఇమ్మని తండ్రిని ఆది అడిగాడు.

‘ఇవ్వాలంటావా?’ అంటూనే తండ్రి పర్సులోంచి తీసి ఓ నోటు ఇవ్వగా, ‘మా కష్టానికి ఇంత తక్కువా?’ అంటూ, తండ్రి చేతిలోని పర్సు లాక్కుని, ఐదొందల నోటు తీసుకున్నాడు ఆది. ఇది సరదా కోసం తమాషాగానే చేసినా.. ఆ తర్వాత తండ్రిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, గుండెలకు హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆది సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

Haircut Time!!

#Haircut timeeee!!iam sure I need one more than my Dad😉#lockdownlife#staypositive

Posted by Aadhi on Monday, June 15, 2020

Recent Articles English

Gallery

Recent Articles Telugu