HomeTelugu Trendingవైభవంగా ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి

వైభవంగా ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి

image 7 1

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది పినిశెట్టి ఎట్టకేలకు నిక్కీ గల్రానీని వివాహం చేసుకున్నారు.2015లో వచ్చిన `యాగవరైనమ్‌ నా కక్కా`(మలుపు) అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్‌ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు `మరగాధ నాణ్యం` చిత్రంతో ప్రేమికులయ్యారు. మార్చిలో ఈ ఇద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకోగా, తాజాగా బుధవారం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ స్టార్‌ హోటల్‌లో వీరి వివాహం బుధవారం రాత్రి జరిగింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇక ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరు కావడం విశేషం. అంతకు ముందు జరిగిన హల్డీ వేడుకలో నాని, సందీప్‌ కిషన్‌ పాల్గొని డాన్సులు చేసి రచ్చ చేశారు. త్వరలో ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రానీని జంట సినీ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్‌ ప్లాన్‌ చేసినట్టు సమాచారం. ఇండస్ట్రీని ఆహ్వానించి విందు ఇవ్వబోతున్నారట. ఈ వీకెండ్‌లో ఉండబోతుందని సమాచారం.

image 6 1 image 5 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu