దక్షిణాదిన మోస్ట్ బ్యాచులర్ హీరోల లిస్ట్‌లో ఆది పినిశెట్టి ఒకరు. కాగా గత కొద్దికాలంగా ఈ హీరో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. మలుపు, మరకతమణి చిత్రాల్లో ఆది తో కలిసి నటించిన నిక్కీ గర్లానీ తో ఆది ప్రేమలో ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు ఆది తండ్రి పుట్టినరోజుకు నిక్కీ హాజరవ్వడంతో సినీవర్గాల్లో చర్చ మొదలయ్యింది. అయితే ఆ పుట్టినరోజుకు ఎక్కువ మంది హాజరయ్యి ఉంటే ఇలాంటి అనుమానాలు వచ్చేవి కావు. కానీ కరోనా కారణంగా కేవలం సహ్నితుల మధ్య జరిగిన ఈ వేడుకకు ఆమె హాజరు కావడం. బర్త్‌డే వేడుకలకు సంబంధించి ఆది సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలలో నిక్కీ కూడా ఉంది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు మరోసారి రుజువైంది. అంతే కాకుండా ఇటీవల పలు ఇంటర్వ్యూ లలో కూడా ఆదిని పెళ్లిగురించి అడిగితే త్వరలోనే చేసుకుంటాను అని సమాధానం ఇస్తూ వచ్చారు. మరి దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.