యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అధికారికంగా ప్రకటించింది ఈ జంట. అంతేకాదు తమ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని తెలియజేస్తూ… ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ ఎంగేజ్‌మెంట్ మార్చి 24న జరగ్గా.. రెండు రోజుల తర్వాత శనివారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
‘2022 మార్చి 24.. మా ఇద్దరికి ఎంతో స్పెషల్. కుటుంభ సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. ఈ మా కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలి’అని తన ట్విటర్ ఖాతాలో ఫొటోలను షేర్ చేసింది నిక్కీ గల్రానీ.
‘యాగవరైనమ్ నా కక్కా’ అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. ‘గుండెల్లో గోదారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
The best thing to hold onto in life is each other.
We found each other a couple of years ago & it’s official now💍
24.3.22 was really special to us.
We got engaged in the presence of both our families🌸
Seeking all you love & blessings as we take on this new journey together🙏🏻♥️ pic.twitter.com/hrMbxieCAn— Nikki Galrani (@nikkigalrani) March 26, 2022