Aa Okkati Adakku: అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఒకప్పుడు ‘ఆ ఒక్కటీ అడక్కు’. చాలా రోజుల తరువాత నరేష్ నటిస్తున్న ఈ కామెడీ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.. దీంతో ఈ సినిమాతో నరేష్ మంచి హిట్ కొడతాడు అనే హోప్స్ తో ఉన్నారు ప్రేక్షకులు.
తాజాగా ఈమూవీ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ అంతా కూడా నరేష్ పెళ్లి మీదే నడిచింది. యవస్సు అవుతున్న పెళ్లి కాకపోవడంతో.. గణకు ఎదురైన పరిస్థితులను ఈ టీజర్‌లో సరదాగా చూపించారు. పెళ్లి కోసం ఎన్నో కష్టాలు పడుతున్న గణకు ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. కానీ పెళ్లి చేసుకుందాం.. అనే సరికి ఆ ఒక్కటీ అడక్కు అంటూ షాక్ ఇస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా నటిస్తుంది. నరేష్ అండ్ ఫరియా కాంబినేషన్ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ ని ఇస్తుంది. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 22న రిలీజ్ కాబోతుంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.