ఆ డైరెక్టర్ తో మరోసారి!
శ్రద్ధాదాస్ కు తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చే సినిమాలు ఇప్పటివరకు రాలేదు. అన్ని సెకండ్ హీరోయిన్,
ప్రత్యేక గీతాల్లోనే మెరిసింది. రీసెంట్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గుంటూర్ టాకీస్’ సినిమాలో
కనిపించిన ఈ భామ మరోసారి ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నటించబోతోంది. అసలు విషయంలోకి
వస్తే.. గడ్డం గ్యాంగ్ సినిమా తరువాత రాజశేఖర్ గా విలన్ గా అవతారమెత్తనున్నారని వార్తలు
వచ్చాయి. కానీ ఆయన హీరోగా ప్రవీణ్ సత్తారు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనొక
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రాజశేఖర్ సరసన పూజా కుమార్ అనే హీరోయిన్
కనిపించనుంది. అలానే ఈ సినిమాలో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉండడంతో ప్రవీణ్
సత్తారు శ్రద్ధాదాస్ ను సంప్రదించారు. ఆమెకు పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గత
చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో తన పాత్ర వైవిధ్యంగా ఉండబోతోందట. మరి ఈ సినిమాతో అయినా..
అమ్మడుకి తెలుగులో అవకాశాలు రావడం పెరుగుతాయేమో చూడాలి!