లాక్‌డౌన్ నేపధ్యంలో దాదాపుగా 40 రోజుల తరువాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా మద్యం కోసం ఎగబడ్డారు. నలభైరోజులు ఇంట్లోనే ఉండి మద్యం లేక ఇబ్బందులు పడిన మందుబాబులు షాపులు తెరుస్తున్నారని తెలిసిన వెంటనే మద్యం కోసం పరుగులు తీశారు. కరోనా వస్తుందేమో అని ఇన్ని రోజులు భయపడి ఇంటికే పరిమితమైన ప్రజలు, మద్యం కోసం కరోనాను కూడా లెక్కచేయకుండా ఎగబడ్డారు అంటే అర్ధం చేసుకోవచ్చు.
అయితే, చిత్తూరు జిల్లాలో ఈ మద్యం ఓ ఇంట్లో విషాదం మిగిల్చింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తిని 40 రోజులపాటు ఎలాగోలా ఇంట్లో ఉంచగలిగారు. కాగా నిన్న మద్యం షాపులు తీసిన తరువాత వెళ్లోద్దని వరించినందుకు భర్త భార్యతో గొడవపడ్డాడు. మద్యం తాగాల్సిందే అని చెప్పి వెళ్ళాడు. భర్త మద్యానికి బానిస కావడం, వద్దని చెప్పినా వినకుండా మద్యం తెచ్చుకోవడానికి వెళ్లడంతో మనస్తాపం చెందిన భార్య, ఆమె కూతురు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది.