టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘ అల వైకుంఠపురంలో ‘. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ వహించగా .. థమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొటింది. అల్లు అర్జున్ కెరియర్ లో మైల్ స్టోన్ గా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది “అలవైకుంఠపురం”. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది.
ఇంతకీ.. విషయం ఏంటంటే వేరే డైరెక్టర్ చెప్పిన కథని తీసుకొని త్రివిక్రమ్ అల వైకుంఠపురములో చిత్రం తెరకెక్కించాడని అని వార్తలు వినిపిస్తుంది. చిన్న చిత్రాలకి రచయితగా పని చేస్తున్నకృష్ణ అనే దర్శకుడు 2005లో త్రివిక్రమ్‌ని కలిసి సేమ్ స్టోరీని వినిపించడట. 2013లో ఈ కథని ఫిలింఛాంబర్‌లో రిజిస్టర్ కూడా చేసుకున్నాడట. నేను చెప్పిన కథని దశ-దిశ అనే టైటిల్‌తో తెరకెక్కించాలనుకున్నానని, కాని త్రివిక్రమ్ నా కథతో అల వైకుంఠపురములో చిత్రం తెరకెక్కించాడని అంటున్నాడు. మరి ఈ వివాదం పై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.