HomeTelugu Trending'పేట' ముహూర్తానికే..థియేటర్‌ ముందే పెళ్లి..!

‘పేట’ ముహూర్తానికే..థియేటర్‌ ముందే పెళ్లి..!

2 9సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అంటే కొందరికి కేవలం తమ అభిమాన సినీనటుడు మాత్రమే కాదు.. ‘అంతకు మించి’. స్టైలుకే స్టైలు నేర్పించే హీరోగా అభిమానులు ఆయనను అభివర్ణిస్తారు. రజనీ సినిమా విడుదల అంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. రజనీపై వారికి అభిమానం ఎంతగా ఉంటుందో నిరూపించే సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. గురువారం ‘పేట’ మూవీ విడుదల సందర్భంగా అంబసు, కమాచి అనే యువతీ యువకులు.. ఈ ముహూర్తాన్నే శుభముహూర్తంగా భావించారు. రజనీ వీరాభిమానులైన వారిద్దరు ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

వీరి పెళ్లి ఏ కల్యాణ మండపంలోనో, గుడిలోనో జరగలేదు. ‘పేట’ సినిమా ఆడుతున్న ఉడ్‌లాండ్స్‌ థియేటర్‌ ముందే జరిగింది. అక్కడే వివాహ వేదికను ఏర్పాటు చేసుకుని, వీరిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. గతంలో రజనీ నటించిన సినిమాల పోస్టర్లు వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ జరిగిన వారి పెళ్లికి రజనీ అభిమానులందరూ ఆహ్వానితులే. ‘పేట’ సినిమా చూడడానికి వచ్చిన అభిమానులందరూ వీరి పెళ్లి చూసి హర్షం వ్యక్తం చేస్తూ అక్షింతలు వేశారు. వివాహం అనంతరం అభిమానులందరికీ భోజనాలు పెట్టారు. రజనీపై తమ అభిమానం ఇలా ఉంటుందని అంబసు, కమాచి నిరూపించుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu